తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటన
ABN, First Publish Date - 2020-11-06T16:30:14+05:30
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2024 ఎన్నికల్లో జరగనున్న
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2024 ఎన్నికల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుభి మోగించాలని ఇప్పట్నుంచే తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పలు కమిటీలను ప్రకటించిన తెలుగుదేశం అధిష్టానం తాజాగా.. రాష్ట్ర కమిటీలను ప్రకటించింది. మొత్తం 219 మందితో టీడీపీ రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు.
18 మంది అధికార ప్రతినిధులు, 58 కార్యనిర్వాహక కార్యదర్శులు ఉన్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీలో 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, కోశాధికారులతో పాటు బడుగు, బలహీన, ఎస్సీలకు 61 శాతం పదవులను అధినేత చంద్రబాబు కేటాయించారు. టీడీపీ కమిటీలో 50 ఉప కులాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఓ ప్రకటన అధిష్టానం తెలిపింది. బీసీలకు 41, ఎస్సీలకు 11, ఎస్టీలకు 3, మైనార్టీలకు 6 శాతం చొప్పున కేటాయింపులు జరిగాయి. టీడీపీ రాష్ట్ర కమిటీలో మహిళలకు అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి :-
నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి
ఉపాధ్యక్షులు :-
నిమ్మల క్రిష్టప్ప
ప్రత్తిపాటి పుల్లారావు
జ్యోతుల నెహ్రూ
గొల్లపల్లి సూర్యారావు
బండారు సత్యానందరావు
రత్నం
దట్ల సుబ్బరాజు
సాయి కల్పనరెడ్డి
వేదవ్యాస్
సుజయకృష్ణ రంగారావు
జయనాగేశ్వర్‌రెడ్డి
వైవీబీ రాజేంద్రప్రసాద్
జి.తిప్పస్వామి
హనుమంతరాయ చౌదరీ
నర్సింహారెడ్డి
దామరచర్ల జనార్ధన్‌రావు
శ్రీధార కృష్ణరెడ్డి
వేమూరి ఆనంద్ సూర్య
ప్రధాన కార్యదర్శులు :-
పయ్యావుల కేశవ్
అనగాని సత్యప్రసాద్
దేవినేని ఉమామహేశ్వరరావు
అమర్నాథ్‌రెడ్డి
బాలవీరాంజనేయస్వామి
బీటీ నాయుడు
భూమా అఖిలప్రియ
ఎండీ నజీర్
గన్ని కృష్ణ
మద్దిపాటి వెంకటరాజు
పంచమర్తి అనురాధ
చంగల రాయుడు
గౌతు శిరీష
దువ్వారపు రామారావు
బుద్దా వెంకన్న
చింతకాయల విజయ్
Updated Date - 2020-11-06T16:30:14+05:30 IST