ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టపాసులపై నిషేధం

ABN, First Publish Date - 2020-11-13T09:29:16+05:30

టపాసులు లేకుండానే ఈ సారి దీపావళి జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా బాణసంచా విక్రయాలను తక్షణం నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ హైకోర్టు ఆదేశం


హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): టపాసులు లేకుండానే ఈ సారి దీపావళి జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా బాణసంచా విక్రయాలను తక్షణం నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. బాణసంచా దుకాణాలను మూసివేయాలని తేల్చిచెప్పింది. టపాసుల వల్ల వాయుకాలుష్యం పెరిగి.. పరిస్థితులు మరింత దిగజారకుండా చూడాలని సూచించింది. ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. బాణసంచాను నిషేధించాలంటూ కూకట్‌పల్లికి చెందిన ఇంద్రప్రకాశ్‌ అనే న్యాయవాది దాఖలుచేసిన పిల్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. హైకోర్టు ఆదేశాలతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో బాణసంచా క్రయవిక్రయాలను నిషేధించినట్టు ఉత్తర్వులు జారీ చేసింది. హిందూ పండుగలను టార్గెట్‌ చేస్తూ కోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేయడంపై విశ్వహిందూ పరిషత్‌ మండిపడింది. కాలుష్యాన్ని అరికట్టాలంటే.. ముందు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను తీసివేయాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-11-13T09:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising