ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవస్థలను కాపాడుకుందాం: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-08-16T09:55:25+05:30

స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో వ్యవస్థలను, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని, అమరవీరులకు అదే నిజమైన ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో వ్యవస్థలను, రాజ్యాంగాన్ని కాపాడుకుందామని, అమరవీరులకు అదే నిజమైన నివాళి అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన హైదరాబాద్‌లోని తననివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఎందరో దేశభక్తుల త్యాగఫలంతో నేడు మనకు స్వేచ్ఛ సిద్ధించింది. వారందరినీ స్మరించుకొని నివాళులు అర్పించే శుభ సందర్భం ఇది. అతి గొప్ప ప్రజాస్వామ్యం, సమగ్రమైన లిఖితపూర్వక రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలతో ప్రపంచానికే తలమానికంగా మన దేశాన్ని తీర్చిదిద్దారు. వ్యవస్థలకు తూట్లు పొడవడం, హక్కులు కాలరాయడం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించడం వ్యక్తి ద్రోహమే కాదు, సమాజ ద్రోహం కూడా. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక ధోరణుల నుంచి వ్యవస్ధలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.


కాగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత వర్ల రామయ్య పతాకావిష్కరణ చేశారు. సీఎం జగన్‌ తన సందేశంలో రాజ్యాంగ విలువల గురించి గొప్పగా మాట్లాడారని, కానీ, ఆయన పాలనలో ప్రజలకు అవి అందుతున్నాయా? అని వర్ల ప్రశ్నించారు. ఇక, జగన్‌ పాలనలో ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కోల్పోయారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. స్వాతంత్య్ర వేడుకల్లో జగన్‌ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని దుయ్యబట్టారు. జగన్‌ తుగ్లక్‌ చర్యలతో ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు.

Updated Date - 2020-08-16T09:55:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising