ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కరోనా కేసులు పెరగడంపై టీడీపీ పొలిట్‌బ్యూరో ఆందోళన

ABN, First Publish Date - 2020-06-05T02:56:46+05:30

ఏపీలో కరోనా కేసులు పెరగడంపై టీడీపీ పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. ఇకపై నెలకోసారి పొలిట్‌బ్యూరో సమావేశం కావాలని నిర్ణయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అమరావతి: ఏపీలో కరోనా కేసులు పెరగడంపై టీడీపీ పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం జరిగింది. ఇకపై నెలకోసారి పొలిట్‌బ్యూరో సమావేశం కావాలని నిర్ణయించారు. వెంటనే సంస్థాగత నియామకాలు చేపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన వన్‌ నేషన్‌-వన్‌ మార్కెట్‌పై టీడీపీ హర్షం వ్యక్తం చేసింది. సీఎం జగన్‌ పీపీఏల సమీక్షల వల్లే కేంద్రం విద్యుత్ చట్టానికి సవరణ తెచ్చిందన్నారు. జగన్‌ ప్రభుత్వం వైఫల్యాలపై టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.


ఏపీలో ఇసుక మాఫియా, భూకొనుగోళ్లలో కుంభకోణాలు.. పేదల పేరిట నిధుల స్వాహా చేస్తున్నారని పొలిట్‌ బ్యూరోలో విమర్శలు గుప్పించారు. 6లక్షల మంది డ్రైవర్లు ఉంటే రెండొంతుల మందికి వాహన మిత్ర ఎగ్గొట్టారని ఆరోపించారు. ఏడాదిలో 800 మంది టీడీపీ నేతలపై దాడులు, ఎనిమిది హత్యలు చేశారని నేతలు మండిపడ్డారు. ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిదంగా ఏపీలో దళితులపై దాడులను టీడీపీ పొలిట్‌ బ్యూరో ఖండించింది. ఏడాది పాలనలో ఇంత విధ్వంసం దేశంలో ఎక్కడా జరగలేదని, ఇళ్ల స్థలాల పేరుతో భూకుంభకోణాలు, వసూళ్ల దందాపై .. క్షేత్రస్థాయిలో పర్యటించాలని టీడీపీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీలో ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేశారు.

Updated Date - 2020-06-05T02:56:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising