టీడీపీ ఎంపీ మూడు రాజధానుల లేఖపై స్పందించిన మోదీ
ABN, First Publish Date - 2020-03-17T03:45:35+05:30
ప్రధాని మోదీకి టీడీపీ ఎంపీ కనకమేడల లేఖ రాశారు. ఏపీ మూడు రాజధానుల అంశాన్ని లేఖలో పేర్కొన్నారు. లేఖను చూసిన మోదీ.....
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి టీడీపీ ఎంపీ కనకమేడల లేఖ రాశారు. ఏపీ మూడు రాజధానుల అంశాన్ని లేఖలో పేర్కొన్నారు. లేఖను చూసిన మోదీ.. కనకమేడలకు రిప్లై ఇచ్చారు. మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చినట్లు మోదీ తెలిపారు.
కాగా ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడుగా విభిజిస్తూసీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకించాయి. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశాయి. అటు అమరావతి ప్రాంత వాసులు కూడా 90 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ కనమేడల.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే మోదీ రిప్లై ఇవ్వడం.. ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2020-03-17T03:45:35+05:30 IST