వైసీపీ అరాచకాలపై ఈసీ ఏం చేస్తోంది: దీపక్‌రెడ్డి
ABN, First Publish Date - 2020-03-12T17:08:37+05:30
రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుంటే ఈసీ, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి నిలదీశారు. చిత్తూరు జిల్లాలో మంత్రి
అమరావతి: రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుంటే ఈసీ, పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు? అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి నిలదీశారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. అధికారులు ప్రభుత్వానికి కాదు.. ప్రజలకు సేవకులు అని గుర్తించాలని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మహిళల దుస్తుల్లో పోలీసులు చేతులు పెడుతున్నారని బాధితులు చెబుతుంటే కన్నీళ్లు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థలోని చీడపురుగులను ఏరివేసే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రజలంటే లెక్కలేనితనంగా ఈసీ ప్రవర్తించొద్దని కోరారు. దాడులకు బాధ్యులైన మంత్రులు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.. వ్యవస్థలను ప్రజలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని దీపక్‌రెడ్డి విన్నవించారు.
Updated Date - 2020-03-12T17:08:37+05:30 IST