ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: టీడీపీ ఎమ్మెల్సీ

ABN, First Publish Date - 2020-07-02T17:56:55+05:30

జగన్ సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: టీడీపీ ఎమ్మెల్సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: అచ్చెన్నాయుడిని హాస్పిటల్ నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయటం జగన్ ప్రభుత్వ రాక్షస విధానమని  మాజీ విప్,  టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ముందురోజు వైద్యులు అచ్చెన్నాయుడు రక్తవిరేచనాలు, కడుపులో మంటతో బాధపడుతున్నట్లు లేఖ రాశారని... అనంతరం ప్రభుత్వ ఒత్తిడితో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డిశ్చార్జి  చేయడం దారుణమన్నారు. అచ్చెన్నాయుడు ప్రాణానికి హాని ఏర్పడితే దానికి ప్రధాన బాధ్యత ముఖ్యమంత్రి జగన్ వహించాలని స్పష్టం చేశారు.


ఈ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు, వైద్యుల వైఖరిని, పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పరిణామాలపై జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంగర రామ్మోహన్ హెచ్చరించారు. 

Updated Date - 2020-07-02T17:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising