ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగ్ నివేదికలు చూస్తే జగన్ షాక్‌లు అర్థమవుతాయ్: పట్టాభి

ABN, First Publish Date - 2020-10-31T01:50:10+05:30

కాగ్ నివేదికలు చూస్తే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న షాక్‌లు ప్రజలకు అర్థమవుతాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : రాష్ట్ర కాగ్ నివేదికలు చూస్తే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న షాక్‌లు ప్రజలకు అర్థమవుతాయని టీడీపీ నేత పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన.. సెప్టెంబర్‌లో రాష్ట్రంపై రూ.8 వేల 38 కోట్ల భారం మోపారని ఆరోపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలలకే రూ.55 వేల 189 కోట్ల అప్పు చేశారన్నారు. ఈ ఒక్క ఆర్థిక ఏడాదిలోనే ప్రభుత్వ అప్పులు రూ.లక్షా 11 వేల కోట్లకు చేరుకొనే అవకాశం ఉంటుందని పట్టాభి జోస్యం చెప్పారు.


టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఐదేళ్లల్లో రూ.లక్షా 25 వేల కోట్లు అని.. జగన్ చేతకాని తనంతో రాష్ట్ర ఆర్థిక లోటు ఏడాదిలోనే 3 రెట్లకు పెంచారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్ట్‌ పూర్తిచేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. వేల కోట్ల అప్పులు చేసి తెచ్చిన సొమ్మంతా అవినీతికే ఆవిరైపోతోందని జగన్ సర్కార్‌పై పట్టాభి తీవ్ర విమర్శలు గుప్పించారు.

Updated Date - 2020-10-31T01:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising