ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిపుత్రులకు అన్యాయం చేయడానికి మనసెలా వచ్చింది: లోకేష్

ABN, First Publish Date - 2020-06-18T18:50:09+05:30

గిరిపుత్రులకు అన్యాయం చేయడానికి మనసెలా వచ్చింది: లోకేష్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గిరిపుత్రుల పట్ల ప్రభుత్వ వైఖరిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘అమాయకులైన గిరిపుత్రులకు అన్యాయం చెయ్యడానికి మనసెలా వచ్చింది జగన్‌రెడ్డి గారు? గిరిజనుల హక్కులను కాలరాసే అధికారం మీకెవరిచ్చారు?. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే కల్పించేలా జీవో-3 తీసుకొచ్చింది నాటి టిడిపి ప్రభుత్వం. సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేస్తే, వైకాపా ప్రభుత్వం దానిపై రివ్యూపిటిషన్ కూడా వెయ్యకపోవడం దారుణం. ఈ విషయంపై గిరిజనులు చేస్తున్న పోరాటానికి టీడీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. గిరిజన హక్కులు కాపాడే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు గిరిజన సలహా మండలిలో చర్చించి ఎస్టీ ఉద్యోగ రిజర్వేషన్‌కి సమగ్ర చట్టం రూపొందించాలి’’ అని లోకేష్ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-06-18T18:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising