ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాట తప్పుడు.. మడమ తిప్పుడే జగన్ నైజం: కళా వెంకట్రావు

ABN, First Publish Date - 2020-08-13T17:22:25+05:30

భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్న మేనిఫెస్టో హామీల్లోనే మోసం చేశారని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్న మేనిఫెస్టో హామీల్లోనే మోసం చేశారని టీడీపీ నేత కళా వెంకట్రావు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ సంక్షేమాన్ని గాలికొదిలేసి సంక్షోభాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మాట తప్పుడు.. మడమ తిప్పుడే జగన్ నైజమని వ్యాఖ్యానించారు. క్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి రికార్డులు సృష్టించారని దుయ్యబట్టారు. మాట తప్పను.. మడమ తిప్పను అని.. మాట తప్పడం, మడమ తిప్పడమే అజెండాగా పాలన సాగిస్తున్నారని అన్నారు. 


షరతుల్లేకుండా అందాల్సిన సంక్షేమాన్ని ఆంక్షల మయం చేశారని ఆరోపించారు. ప్రతీ పిల్లవాడికీ అన్న అమ్మఒడి వంచనకు కేరాఫ్ అడ్రస్ అయిందని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. 45 ఏళ్లకే పెన్షన్ అని...అధికారంలోకి వచ్చాక తూచ్ అన్నారని మండిపడ్డారు. సన్నబియ్యం హామీపై అసెంబ్లీ సాక్షిగా మాట మార్చారన్నారు. వాహన మిత్రను యజమానులకు పరిమితం చేసి డ్రైవర్లను మోసగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్లను నిలిపివేసి పేదలు ఆకలి కేకలు వేసేలా చేశారన్నారు. సంక్షేమం హామీలతో బడుగు బలహీన వర్గాలను రోడ్డున పడేశారని విమర్శించారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి సంక్షోభం సృష్టించారన్నారు. కరోనా సమయంలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచి రూ.60 వేల కోట్ల భారం మోపారన్నారు. ఆదుకోవాల్సిన సమయంలో ఆర్థిక భారాలు మోపి ప్రజల నడ్డి విరిచారని... టీడీపీ హయాంలో బర్త్ టూ డెత్ సంక్షేమం కల్పించామని కళా వెంకట్రావు తెలిపారు. 

Updated Date - 2020-08-13T17:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising