ఆ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలి: జవహర్
ABN, First Publish Date - 2020-05-09T21:19:20+05:30
విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను తక్షణమే మూసివేయాలని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన
అమరావతి: విశాఖలో పెను విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను తక్షణమే మూసివేయాలని మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. మానవ తప్పిదం కారణంగా జరిగిన ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిత్‌తో పాటు సాంకేతిక నిపుణులతో విచారణ జరిపించాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రను మూసివేయాలని బాధితులు రహదారిపై మృతదేహలతో నిరసన తెలిపితే అరెస్టులు చేయడం సమంజసమా? అని అన్నారు. ప్రమాదానికి కారణమైన కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి స్థాయిలో పక్కన కూర్చోపెట్టుకుని చర్చించడంలో ఏదో మతలబు ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విషపూరితమైన స్టైరెన్ గ్యాస్ పీల్చడంతో బాధితులు రానున్న కాలంలో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో బాధితులందరికీ వైద్యం కోసం శాశ్వత ఆరోగ్య గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని జవహర్ డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు రూ.కోటి వెల కట్టిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై బాధితులు తిరగబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడం దారుణం అన్నారు. అధికార దాహంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదేదే మాట్లాడుతున్నారని జవహర్ ధ్వజమెత్తారు.
Updated Date - 2020-05-09T21:19:20+05:30 IST