వైసీపీకి ఎన్టీఆర్‌ను చూస్తే వణుకుపుడుతుందేమో..: టీడీపీ నేత
ABN, First Publish Date - 2020-08-22T16:07:06+05:30
అవినీతిని ప్రశ్నిస్తున్న లోకేష్ బాబును వైసీపీ నాయకులు ఎంత విమర్శించినా ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటారని టీడీపీ నేత దేవతోటి నాగరాజు స్పష్టం చేశారు.
అమరావతి: అవినీతిని ప్రశ్నిస్తున్న లోకేష్ బాబును వైసీపీ నాయకులు ఎంత విమర్శించినా ఆయన ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటారని టీడీపీ నేత దేవతోటి నాగరాజు స్పష్టం చేశారు. అవినీతికే పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వంలో నిజాయితీగా పరిపాలించిన ఎన్టీఆర్‌ను చూస్తే వెన్నులో వణుకు పుడుతుందేమో అని అన్నారు. అందుకే ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్నారని నాగరాజు విమర్శలు గుప్పించారు.
Updated Date - 2020-08-22T16:07:06+05:30 IST