ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులు, శ్రామికులకు మేడే శుభాకాంక్షలు: చంద్రబాబు ట్వీట్

ABN, First Publish Date - 2020-05-01T16:26:30+05:30

కార్మికులు, శ్రామికులకు మేడే శుభాకాంక్షలు: చంద్రబాబు ట్వీట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కార్మికులకు, శ్రామికులకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  మేడే శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘కార్మికులు సంక్షేమంతో వర్ధిల్లినప్పుడే సమాజ ప్రగతి సాధ్యం. టీడీపీ హయాంలో కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో చేశాం. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాం.హోం గార్డుల నుంచి కాంట్రాక్ట్‌ కార్మికుల వరకు అందరికీవేతనాలు పెంచాం. రూ.5 లక్షల ప్రమాద బీమా పథకం కార్మిక సంక్షేమంలో ఓ విప్లవం. అలాంటిది ఈ ఏడాదంతా కార్మికులకు కష్టాలు, కన్నీళ్లనే మిగిల్చింది. వైసీపీ నేతల స్వార్థం కారణంగా ఇసుక కొరతతో 60 మంది కార్మికుల ఆత్మహత్యలు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రమాద బీమా పథకం ఆగిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా కార్మికుల కుటుంబాలు మరింత చితికిపోయాయి. ఇక నుంచైనా ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని పట్టించుకోవాలి. వచ్చే మేడే నాటికి కార్మిక కుటుంబాలన్నీ ఆర్థికంగా పుంజుకోవాలని ఆశిస్తున్నా. టీడీపీ మీకెప్పుడూ అండగా ఉంటుంది. కార్మికులు, శ్రామికులకు మేడే శుభాకాంక్షలు’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-05-01T16:26:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising