ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఎక్కడుంది: బోండా

ABN, First Publish Date - 2020-09-19T16:27:09+05:30

రాజధాని అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఎక్కడుందో వైసీపీ చెప్పాలని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు. ‘ఇన్‌ సైడర్ ట్రేడింగ్ అనేది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని అమరావతిలో భూములు కొనకూడదని చట్టంలో ఎక్కడుందో వైసీపీ చెప్పాలని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు. ‘ఇన్‌ సైడర్ ట్రేడింగ్ అనేది బూటకం. జగన్ పాలనలో వన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతుంది. వైసీపీ ఎంపీలు సిట్, ఏసీబీ తీర్పులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కోర్టు బోనులో చేతులు కట్టుకుని నిలబడే వైసీపీ నాయకులు జడ్జీలకు చట్టాలు చెబుతున్నారు. వైఎస్.వివేకానందరెడ్డి హత్యపై జగన్ కోర్టు కెళ్తే అప్పటి సీఎం చంద్రబాబుపై హైకోర్టు తీర్పు వైసీపీకి గుర్తులేదా? దమ్మలపాటి కేసులో హైకోర్టు తీర్పు కొత్తేమీ కాదు. గతంలో గవర్నర్ తివారీ, మొన్న రకుల్ ప్రీతిసింగ్ కేసులో ఇదే విధంగా తీర్పులిచ్చాయి. కోర్టు తీర్పులపై ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులు గత తీర్పులు కనపడడం లేదా? అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలకు జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాం. గతంలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సీఎంగా జీవో నెం.243 ద్వారా 2005లో జడ్జీలకు ఇంటి స్థలాలు ఇచ్చారు’ అని బోండా ఉమ గుర్తుచేశారు.

Updated Date - 2020-09-19T16:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising