ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆ రెండూ పోయి బంతిపూల మందు వచ్చిందా రోజా గారూ?’

ABN, First Publish Date - 2020-04-21T20:25:10+05:30

ప్రపంచం అంతా సోషల్ డిస్టెన్సింగ్ అని మొత్తుకుంటున్న కీలక సమయంలో తుగ్లక్ సైన్యం మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదని వైసీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రపంచం అంతా సోషల్ డిస్టెన్సింగ్ అని మొత్తుకుంటున్న కీలక సమయంలో తుగ్లక్ సైన్యం మాత్రం అదేమీ పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ నాయకురాలు అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రోజా పర్యటనకు సంబంధించి ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన అనిత.. రోజా తీరుపై మండిపడ్డారు. ఆ వీడియోలో కొందరు రోజాకు స్వాగతం పలుకుతూ ఆమెపై బంతిపూలు చల్లుతున్నారు. దీనిని అనిత తీవ్రంగా తప్పుపట్టారు. ‘మనం రాజరికంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే సందేహం గత పది నెలలుగా నన్ను తొలుస్తుంది. కానీ మనం రాజరికంలో ఉన్నామని ఖచ్చితమైన కన్ఫర్మేషన్‌ను రోజా రెడ్డి ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ‘కరోనా విజృంభిస్తున్న వేళ పక్కపక్కనే నిలబడి బంతిపూలు చల్లటం ఏంటి రోజా రెడ్డి గారూ..? బంతిపూలు చల్లితే కరోనా చచ్చిపోతుందా?’ అని ప్రశ్నించారు. బ్లీచింగ్ ఫౌడర్, పారాసిటమాల్ తర్వాత మీ కౌరవ సైన్యం(వైసీపీ నేతలు) కనిపెట్టిన కొత్త మందు బంతిపూలా? రోజా గారూ అని అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదిలాఉండగా, లాక్‌డౌన్ సమయంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ ర్యాలీ చేసి మరీ సీఎం జగన్ భార్య భారతి రెడ్డి భజన చేశారని, అక్కడ 11 మందికి కరోనా వ్యాపించిందని అనిత పేర్కొన్నారు. దీనికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు. ఈ అద్భుత గట్టాన్ని ఓ జాతియ పత్రిక కోవ్‌ఇడియట్స్‌గా కీర్తించిందని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-21T20:25:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising