ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియంతలే నిష్టురపోయేలా జగన్ క్రూరత్వం: కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2020-06-18T23:00:21+05:30

నియంతలే నిష్టురపోయేలా జగన్ క్రూరత్వం: కొల్లు రవీంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. నియంతలే నిష్టురపోయేలా జగన్ క్రూరత్వం ఉందని, శాసన మండలిలో మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటుగా ఉందని ఆయన అన్నారు. టీడీపీ నేతలు తప్పు చేశారంటున్న మంత్రులు మండలి వీడియోలు బయటపెట్టాలని రవీంద్ర డిమాండ్ చేశారు. ఏడాది జగన్ పాలనలో దాడులు, దౌర్జన్యాలే తప్ప అభివృద్ధి లేదని, దేవాలయం లాంటి చట్టసభలనూ అరాచకాలకు బలి చేస్తున్నారని విమర్శించారు. మంత్రులు వ్యవహరించిన తీరు చూసి ప్రజలు భయపడుతున్నారుని రవీంద్ర మండిపడ్డారు. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదించుకుందామని ప్రతిపక్షమే కోరడం ఆశ్చర్యమని, మంత్రులు మాత్రం ద్రవ్య వినిమయ బిల్లు వద్దని వారించడం దుర్మార్గమన్నారు. సెలెక్ట్ కమిటీ, కోర్టుల్లో ఉన్న బిల్లులపై మంత్రులు పట్టుబట్టడం దారుణమని, తొడకొట్టడం, మీసాలు మెలేయడం, ప్యాంట్ జిప్ తెరవడం సిగ్గుచేటన్నారు. మంత్రులు రౌడీలు, గూండాల్లా వ్యవహరించారని, మహిళా సభ్యులు తలదించుకునేలా మంత్రులు వ్యవహరించారని రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు దాడి చేశారన్నది నిజమైతే కౌన్సిల్ వీడియోలు బయటపెట్టాలని, డీబీసీలను అణచివేయడమే ధ్యేయంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Updated Date - 2020-06-18T23:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising