ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీలక నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించిన టీడీపీ

ABN, First Publish Date - 2020-02-19T21:42:59+05:30

ఏపీలో తెలుగుదేశం బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాల మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కీలకంగా ఉన్న పలు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఏపీలో తెలుగుదేశం బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తల సూచనలు, సలహాల మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కీలకంగా ఉన్న పలు నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు. 


కొత్త ఇంఛార్జ్‌లు వీరే!

ఏలూరు : బడేటి రాధా కృష్ణయ్య (చంటి) 

గుడివాడ : రావి వెంకటేశ్వర్లు 

బాపట్ల : వేగ్నేష నరేంద్ర వర్మ

మాచర్ల : కొమ్మారెడ్డి చలమారెడ్డి 


త్వరలోనే మిగిలినవి కూడా!

జిల్లా మరియు నియోజకవర్గ నాయకులతో సంప్రదించి, స్థానిక కార్యకర్తలతో అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుని నియామకాలను చేపట్టడం జరిగింది టీడీపీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. మిగిలిన నియోజకవర్గాలకు కూడా ఇంఛార్జుల నియామకం ప్రక్రియ పూర్తి చేయడం జరగుతుందని ప్రకటనలో తెలిపింది. వీరంతా నిత్యం ప్రజల్లోనే ఉంటూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ముఖ్య భూమిక పోషించాల్సి ఉంటుందని టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


మార్పులు ఎందుకంటే..!

ఇదిలా ఉంటే.. ఏలూరు నుంచి ఇదివరకు ఇంచార్జ్‌గా వ్యవహరించిన బడేటి బుజ్జి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే అదే కుటుంబం నుంచి రాజకీయాల్లో ఉన్న మరో నేత బడేటి రాధా కృష్ణయ్య (చంటి) కి ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక గుడివాడ నియోజకవర్గం విషయానికొస్తే.. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన దేవినేని అవినాష్.. వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దీంతో.. ఇదివరకు ఒకట్రెండు సార్లు పోటీ చేసి సీనియర్‌గా ఉన్న రావి వెంకటేశ్వర్లుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని టీడీపీ నిర్ణయించింది.



Updated Date - 2020-02-19T21:42:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising