ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మృతివనం తరలించొద్దంటూ టీడీపీ, దళిత నేతల మౌనదీక్ష

ABN, First Publish Date - 2020-07-09T08:35:28+05:30

రాజధాని అమరావతిలో అంబేడ్కర్‌ స్మ్మతివనం ఉండకూడదా? అని టీడీపీ దళిత నేతలు ప్రశ్నించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుళ్లూరు, జూలై 8: రాజధాని అమరావతిలో అంబేడ్కర్‌ స్మ్మతివనం ఉండకూడదా? అని టీడీపీ దళిత నేతలు ప్రశ్నించారు. బుధవారం శాఖమూరులోని స్మృతివనం వద్ద రాజధాని దళిత జేఏసీ నేతలు మౌన దీక్ష చేశారు. ఈ దీక్షకు టీడీపీ నాయకులు వర్ల రామయ్య, తెనాలి శ్రావణ్‌కుమార్‌, నక్కా ఆనందబాబు సంఘీభావం తెలిపారు. శాఖమూరులో అంబేడ్కర్‌ స్మ్మతివనం ఫౌండేషన్‌ పనులు పూర్తయ్యే దశలో వైసీపీ ప్రభుత్వం విజయవాడకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ స్మృతి వనానికి టీడీపీ ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించగా, వైసీపీ ప్రభుత్వం విజయవాడలో మొక్కుబడిగా రెండెకరాలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని వర్ల రామయ్య విమర్శించారు. దళితులున్న నియోజకవర్గంలో రాజధాని ఉండకూడదని సీఎం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని శ్రావణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో అంబేడ్కర్‌ ఉనికే లేకుండా చేయాలని సీఎం జగన్‌ స్మృతివనం తరలింపు చేపట్టారని నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నేతలు మౌన దీక్ష చేశారు.

Updated Date - 2020-07-09T08:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising