ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలే సూపర్‌ స్ర్పెడర్స్‌: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-04-28T09:13:34+05:30

రాష్ట్రంలో వైసీపీ నేతలు కరోనా సూపర్‌ స్ర్పెడర్స్‌గా మారడం దిగ్ర్భాంతి కలిగిస్తోందని టీడీపీ అధినేత చం ద్రబాబు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ నేతలు కరోనా సూపర్‌ స్ర్పెడర్స్‌గా మారడం దిగ్ర్భాంతి కలిగిస్తోందని టీడీపీ అధినేత చం ద్రబాబు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి విశాఖపట్నం లో ఒక మంత్రి, ఎంపీలు.. వందలాది మంది వైసీపీ కార్యకర్తలతో ఒక ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం పెట్టడం దారుణమన్నారు. అదే హాలులో జగ న్‌ ప్రభుత్వం కరోనా పరీక్షలకు తాత్కాలిక కేంద్రాన్ని ఏర్పాటుచే సిందని.. పరీక్షల ఫలితాల కోసం పలువురు నిరీక్షిస్తున్నారని తెలిపారు. పరీక్షల కేంద్రంలోనే ఇలాంటి సమావేశాలు పెట్టడం వైర స్‌ వ్యాప్తి పెరిగేందుకు కా రణమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు చంద్రబాబు సోమవారం ట్వీట్‌ చేశారు. ‘ఏపీలో మీరు సృష్టించిన ఇసుక కొరత వల్లే పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వలస వెళ్లాం.


ఇప్పుడీ లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కూడా పోయింది. స్వగ్రామాలకు పంపిస్తే చాలని వేడుకుంటున్న కార్మికులకు సీఎం ఏం సమాధానం చెబుతారు’ అని నిలదీశారు. వలస కార్మికులు సామాజిక మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోను ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు. ‘తన జీవితకాలంలో మూడు తరాల గీత కార్మికులకు తాడిచెట్టు జీవనాధారమవుతుంది. అలాంటిది కాకినాడ రూరల్‌ నేమం గ్రామంలో రాత్రికి రాత్రి 1500 తాడిచెట్లను, 500 ఈత చెట్లను జేసీబీలతో రాష్ట్ర ప్రభుత్వం కూల్చేసింది. గ్రామంలో దాదాపు 400 గీత కార్మిక కుటుంబాలకు జీవనాధారం లేకుండా చేసే అధికారం ఎవరిచ్చారు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.


కాంట్రాక్టర్లకిచ్చి ఉద్యోగులకు ఇవ్వరా: బుచ్చయ్యచౌదరి

కాంట్రాక్టర్లకు రూ.6,400 కోట్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం.. ఉద్యోగులకు మాత్రం 50ు జీతాలే ఇవ్వడం ఏంటని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు. కాంట్రాక్టర్లపై, అదీ కావాల్సిన కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ఉద్యోగులపై లేదా అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. 

Updated Date - 2020-04-28T09:13:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising