ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సత్తా లేకే 5 రోజులు సస్పెండ్ చేసింది: చంద్రబాబు

ABN, First Publish Date - 2020-12-04T22:20:21+05:30

వైసీపీ ప్రభుత్వంపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘చేసింది చెప్పుకునే సత్తా లేకే 5 రోజులు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘చేసింది చెప్పుకునే సత్తా లేకే 5 రోజులు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసింది. ప్రజల్ని బ్లాక్‌మెయిల్ చేయటం, వారి తరఫున మాట్లాడే వారిపై దాడులు చేయటం నీచం. రైతు సమస్యల పరిష్కారం ఆలోచనే లేదు. దశా దిశ లేని దిశ చట్టాన్ని ఆటకెక్కించారు. అవగాహన లేని ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు దిశ చట్టo ఓ ఉదాహరణ. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక న్యాయంతో ముందుకు పోయాం. దాడులు చేస్తూ అవాస్తవాలను నిజం చేయాలనుకోవడం కుదరదు. ప్రత్యేక హోదాపై కథలు చెప్పి ఆ ఊసే లేకుండా చేశారు. భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి వైసీపీ నేతలు పొట్టలు నింపుకున్నారు. ఏడాదిన్నరగా ఇసుక విధానంలో గాడిదలు కాశారా? ఇష్టానుసారంగా రేట్లు పెంచేసి దోచుకున్నారు’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.


వీడియోలు ప్రదర్శన..

వివిధ పథకాలపై ఎన్నికల ముందు జగన్ మాట్లాడిన పలు వీడియోలు చంద్రబాబు ప్రదర్శించారు. ఆదాయం కంటే అప్పులు ఎక్కువ చేశారని చంద్రబాబు ఆరోపించారు. వీటికి రెవెన్యూ లోటు తోడైందన్నారు. ఇష్టానుసారంగా పన్నులు పెంచేశారని చెప్పారు. లెక్కలు తారుమారు చేస్తున్నారని చెప్పారు. పంటల బీమాలో రైతుల్ని మోసం చేశారన్నారు. 26 లక్షల మందికే కట్టి 50 లక్షల మందికి కట్టినట్లు అసత్యాలు చెప్పారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు వేలం వేయటానికి అవేమీ జగన్ అబ్బ సొత్తు కాదన్నారు.

Updated Date - 2020-12-04T22:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising