కరోనా కంటే డేంజరస్ వైరస్ జగన్: చంద్రబాబు
ABN, First Publish Date - 2020-11-03T21:25:26+05:30
ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న డేంజరస్ వైరస్ జగన్మోహన్ రెడ్డేనని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 175 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, టీడీపీ ప్రజా ప్రతినిధులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను పట్టి పీడిస్తున్న డేంజరస్ వైరస్ జగన్మోహన్ రెడ్డేనని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 175 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, టీడీపీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కరోనాను మించిన వైరస్ జగనేనని చెప్పారు. ‘‘నా ఇల్లు- నా స్వంతం’’, ‘‘నా స్థలం-నాకు ఇవ్వాలి’’ అంటూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీడీపీ పిలుపునిచ్చింది.
‘ప్రజా ఆందోళనలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలి. లబ్ధిదారులైన పేద కుటుంబాలకు అండగా ఉండాలి. వాళ్ల ఇళ్లు, వాళ్ల స్వాధీనం అయ్యేదాకా బాధితుల తరఫున పోరాడాలి. ‘సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి పేద కుటుంబం కల’. పేదల సొంతింటి కల నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వం కృషి. కట్టిన ఇళ్ల వల్ల టీడీపీకి మంచిపేరు వస్తుందనే అక్కసుతో వాటిని నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ పెట్టుకుంది. కట్టిన ఇళ్లు ఎప్పుడిస్తారా? అని పేదలంతా ఎదురు చూస్తున్నారు. డిపాజిట్ కట్టిన పేదలకు ఇళ్లు ఇవ్వకుండా వైసీపీ నమ్మకద్రోహం చేసింది. తమ కష్టార్జితాన్ని డిపాజిట్లుగా చెల్లించి, లాటరీలో పొందిన ఇళ్లను ఎలా రద్దు చేస్తారు..? సంక్రాంతి కల్లా ఇళ్లను పేదలకు స్వాధీనం చేయాలి’ అని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి డేంజరస్ వైరస్...
‘ఏపీని పట్టి పీడిస్తున్న డేంజరస్ వైరస్ జగన్మోహన్ రెడ్డి. కరోనాను మించిన వైరస్ జగన్. ఫేక్‌న్యూస్‌నే నిజాలుగా నమ్మింప చేయడంలో జగన్ ఘనుడు. కులం, మతం విద్వేషాలు రగిలించడంలో ఆరితేరినవాడు జగన్. పేరుమోసిన క్రిమినల్స్‌తో కేసులు వేయించడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేసి మంచివాళ్లపై బురద జల్లడం వైసీపీ నాయకులకు నిత్యకృత్యంగా మారింది. కేంద్రమంత్రి పేరుతో మోసగించిన వాడితో కేసులు వేయిస్తారు. పేకాట దందాలు నడిపేవాడితో కేసులు వేయిస్తారు. క్రిమినల్స్‌ను అడ్డం పెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారు’ అని సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు.
Updated Date - 2020-11-03T21:25:26+05:30 IST