ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసిన టీడీపీ

ABN, First Publish Date - 2020-04-09T22:35:52+05:30

లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్రానికి టీడీపీ పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది. కొద్ది సేపటి క్రితం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్రానికి టీడీపీ పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది. కొద్ది సేపటి క్రితం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. అనంతరం టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని దుయ్యబట్టారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాలని, కూలీలు, పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.5 వేలు ఇవ్వాలని కేంద్రం చెబుతున్నా అరకొర సాయంతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. మెడ్‌టెక్‌ జోన్‌ ఫలితం దేశమంతా ఉపయోగపడుతోందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందుచూపును టీడీపీ పొలిట్‌బ్యూరో  అభినందించింది.


కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, కరోనా వైద్యసేవలు అందిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని కాల్వ శ్రీనివాసులు కోరారు. రైతుల కరెంట్‌, నీటి బిల్లులను రద్దు చేయాలని, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని, అందరికీ ఉచితంగా కరోనా టెస్ట్‌లు చేయాలని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

Updated Date - 2020-04-09T22:35:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising