ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారు

ABN, First Publish Date - 2020-07-10T08:32:39+05:30

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అదే జిల్లా నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోండి
  • పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, గ్రంధి ఫిర్యాదు

నరసాపురం/భీమవరం టౌన్‌, జూలై 9: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అదే జిల్లా నరసాపురం, భీమవరం ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు తన గౌరవ మర్యాదను కించపరిచేలా ఉన్నాయని ప్రసాదరాజు బుధవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సీఐ కృష్ణమోహన్‌ తెలిపారు. తన పరువు ప్రతిష్ఠలకు భంగంవాటిల్లే విధంగా మాట్లాడిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌ గురువారం భీమవరం వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల రఘురామకృష్ణంరాజు పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంతో అధిష్ఠానం ఆయనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చిందని..


తదనంతరం ఆయన సోషల్‌ మీడియా, ప్రచార మాద్యమాల్లో, గత నెల 16న మాట్లాడిన మాటలు, వ్యవహరించిన తీరు వైసీపీ కార్యకర్తలు, అభిమానుల్లో వర్గ వైష్యమ్యాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని.. సమాజంలో, నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవిధంగా ఉన్నాయని శ్రీనివాస్‌ తెలిపారు. ‘ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా.. పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్‌గా వస్తుందని, వీళ్లు 2014 ఎన్నికల్లో ఏం పీకారు, వీళ్లందరూ దొంగలు అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సంఘంలో గౌరవప్రదమైన బాధ్యతాయుత పదవిలో ఉన్న నా గౌరవ మర్యాదలకు, పరువు ప్రతిష్టలకు భగం కలిగించడమే కాకుండా.. తీవ్ర మనోవేదనకు గురిచేశాయి’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-10T08:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising