మరో వివాదంలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి
ABN, First Publish Date - 2020-09-14T23:47:22+05:30
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. తుళ్ళూరులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి పెద్ద
గుంటూరు: తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మరో వివాదంలో చిక్కుకున్నారు. తుళ్ళూరులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. కరోనా నేపథ్యంలో ఇంత మంది పాల్గొనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని కోసం పోరాడే రైతులను కరోనా నిబంధనలు పేరుతో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. వైసీపీ మీటింగ్‌లకు లేని కరోనా నిబంధనలు తమకు వర్తించవా? అంటూ రైతులు నిలదీస్తున్నారు. నిలదీసిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తీరుపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2020-09-14T23:47:22+05:30 IST