ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏబీఎన్ చేతిలో ‘స్వర్ణ ప్యాలెస్’ రిమాండ్ రిపోర్టు

ABN, First Publish Date - 2020-08-15T21:32:48+05:30

స్వర్ణ ప్యాలెస్ ఘటనపై రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి రిమాండ్ రిపోర్టు చిక్కింది. రిపోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ ఘటనపై రిమాండ్ రిపోర్టులో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి రిమాండ్ రిపోర్టు చిక్కింది. రిపోర్టులో వివరాలు ఇలా ఉన్నాయి. ‘విజయవాడ సెంట్రల్ ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి.. హోటల్లో విద్యుత్ వైరింగ్‌ లోపాలున్నాయని ముందే తెలుసు. సరి చేయాలంటే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని తెలిసినా.. బాగు చేయించలేదు. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 10 మంది చనిపోగా, ఇరవై మందికి గాయాలయ్యాయి. లోపాలు తెలిసినప్పటికీ వాటిని సరి చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యం వల్లే కోవిడ్ కేర్ సెంటలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంపై బాధ్యత ఆసుపత్రి, హోటల్ యాజమాన్యాలే తీసుకోవాలి. ప్రాథమిక సాక్ష్యాధారాలతో నైట్ షిప్ట్ మేనేజర్ పల్లపోతు వెంకటేష్, వైద్యులు రాజగోపాల్, సుదర్శన్‌లను అదుపులోకి తీసుకున్నాం’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసు అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-15T21:32:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising