ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చివరి రోజూ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు

ABN, First Publish Date - 2020-12-05T08:24:41+05:30

అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఉపాధి పనుల పెండింగ్‌ బిల్లులను తక్షణ మే చెల్లించాలంటూ గట్టిగా పట్టుబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చివరి రోజూ వేటు

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌


అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కూడా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఉపాధి పనుల పెండింగ్‌ బిల్లులను తక్షణ మే చెల్లించాలంటూ గట్టిగా పట్టుబట్టారు. శుక్రవారం సభ ప్రారంభం కాగానే ప్రభు త్వం కొన్ని బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించింది. ఒకపక్క అది జరుగుతుండగానే.. టీడీపీ సభ్యులు ఉపాధి బిల్లులపై నినాదా లు చేశారు. సర్పంచులు, ఎంపీటీసీల ఆత్మహత్యలు ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై చర్చ చేపట్టాలన్నారు. ఇందుకు సభాపతి తమ్మినేని సీతారాం అంగీకరించకపోవడంతో.. విపక్ష సభ్యులు పోడియం వద్దకెళ్లి నిరసన తెలిపారు. కొద్దిసేపటికి సభాపతి స్థానం వద్దకు వెళ్లి ఈ అంశాన్ని చర్చ కు తీసుకోవాలని.. నినాదాలు చేశారు. దీంతో ‘పోడియం వరకు రావడమే కాకుం డా సభాపతి స్థానం వద్దకు ఎక్కి అడగడమేంటి? మీకు బుద్ధుందా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా టీడీపీ సభ్యులు అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడారు.


‘ఉపాధి పనుల్లో అక్రమాలు, అవకతవకలపై   ఫి ర్యాదులు వచ్చాయి. వేసిన రోడ్లు కూడా కొన్ని చోట్ల పోయాయి. వాటిపై విజిలెన్స్‌ విచారణ వేశాం. ఆ నివేదిక వచ్చాక ఉన్న రోడ్లకు చెల్లింపులు చేస్తాం. విచారణ జరుగుతుండగా చెల్లింపులు ఎలా చేస్తారు’ అని ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చకు సరైన ఫార్మాట్‌లో రావాలని సభాపతి టీడీపీ స భ్యులకు సూచించారు.  ఒక దశలో సభాపతికి-సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వారు స్పీకర్‌ స్థానం వద్దే ఉండి నిరసన వ్యక్తం చేస్తుండడంతో టీడీపీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలను.. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్యచౌదరి, బాలవీరాంజనేయస్వామి, రామకృష్ణబాబు, అశోక్‌, సత్యప్రసాద్‌, జోగేశ్వర్‌రావు, రామరాజులను సస్పెండ్‌ చేశారు. అనంతరం మిగతా  సభ్యులు కూడా నిరసనతో వాకౌట్‌ చేశారు.  


బిల్లుల కోసం ర్యాలీ..

ఉపాధి పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.2,500 కోట్ల బిల్లులను వెం టనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం చంద్రబా బు నేతృత్వంలో సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీ వరకు ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. 

Updated Date - 2020-12-05T08:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising