ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సస్పెండ్‌ చేస్తే ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు

ABN, First Publish Date - 2020-12-05T09:23:45+05:30

‘సభాపతి స్థానం వద్దకొచ్చి అల్లరి చేయడమేంటి? వారిని సస్పెండ్‌ చేయడం పట్ల మథనపడుతున్నాను. సస్పెండ్‌ చేసిన రోజు ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సభాపతి స్థానం దగ్గరకొచ్చి అల్లరి చేస్తారా?: స్పీకర్‌


అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ‘సభాపతి స్థానం వద్దకొచ్చి అల్లరి చేయడమేంటి? వారిని సస్పెండ్‌ చేయడం పట్ల మథనపడుతున్నాను. సస్పెండ్‌ చేసిన రోజు ఒక్కోసారి నిద్ర కూడా పట్టదు’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. ఆయన శుక్రవారం తెలుగుదేశం సభ్యులను సస్పెండ్‌ చేశాక సభలో మాట్లాడారు. వరుసగా ఐదురోజులు ప్రతిపక్ష సభ్యులు తన బాధను వినిపించుకోలేదని.. ఐదు రోజులూ  సస్పెండయ్యారని చెప్పారు. ‘ఏదోరకంగా గందరగోళం సృష్టించి సస్పెండవ్వాలనే చూస్తున్నారు. వారిని నియంత్రణ అయినా చేయాలి. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సభ నడిచేలా అయినా చేయాలి. విపక్ష సభ్యులకు తెలియని విషయం ఏంటంటే ఇలా గందరగోళం చేసి ఏదో చేశామంటూ రాజకీయ ప్రయోజనం పొందేవారి విషయంలో ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈరోజు జరిగింది అత్యంత హీనం.. హేయం. ఇలాంటి పోకడల నియంత్రణకు శాసనసభకు కమిటీలున్నాయి. అవసరం అనుకుంటే కఠిన సవరణలు తేవాలి’ అని పేర్కొన్నారు.

Updated Date - 2020-12-05T09:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising