ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే నమ్మకం ఏంటి?: హైకోర్టు

ABN, First Publish Date - 2020-05-29T23:09:32+05:30

డాక్టర్‌ సుధాకర్ రిట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్‌కు మెరుగైన వైద్యం అందించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సుధాకర్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: డాక్టర్‌ సుధాకర్ రిట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్‌కు మెరుగైన వైద్యం అందించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సుధాకర్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది, కోర్టుకు తెలిపారు. సుధాకర్ పోలీస్‌ కస్టడీలో ఉన్నారా.. జుడిషియల్ కస్టడీలో ఉన్నారో తెలపాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వ తరపు న్యాయవాది రెండు రోజుల గడువు కోరారు. ఈ రెండు రోజుల్లో సుధాకర్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదనే నమ్మకం ఏంటని న్యాయమూర్తి ప్రశ్నించారు.


విశాఖ మానసిక వైద్యశాలలో సంబంధం లేని మందులిస్తున్నారని, ఆ ఆస్పత్రి చికిత్సపై నమ్మకం లేని తనను మెరుగైన చికిత్స కోసం తక్షణం వేరే ఆస్పత్రికి తరలించి, కోర్టు పర్యవేక్షణలో వైద్యం అందించేలా ఆదేశాలు జారీచేయాలంటూ డాక్టర్‌ సుధాకర్‌ హైకోర్టును అభ్యర్థించిన విషయం తెలిసిందే. తనకు అందిస్తున్న చికిత్సపై ఇప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు లేఖ రాశానని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సీపీ, విశాఖ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌లను పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-29T23:09:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising