ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీతోనే ఉంటా: క్లారిటీ ఇచ్చిన గల్లా అరుణ

ABN, First Publish Date - 2020-10-02T01:23:04+05:30

వ్యక్తిగత కారణాలతోనే టీడీపీ పొలిట్‌బ్యూరోకి రాజీనామా చేశానని ఆ పార్టీ నేతల గల్లా అరుణ తెలిపారు. పార్టీలు మారే తత్వం తమది కాదని స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: వ్యక్తిగత కారణాలతోనే టీడీపీ పొలిట్‌బ్యూరోకి రాజీనామా చేశానని ఆ పార్టీ నేత గల్లా అరుణ తెలిపారు. పార్టీలు మారే తత్వం తమది కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లేకుండాపోయే పరిస్థితి వచ్చింది కాబట్టే టీడీపీలోకి వచ్చామని, ఎక్కడ ఉన్నా నిబద్ధతతోనే ఉంటామని చెప్పారు. టీడీపీతోనే ఉంటా.. ఎక్కడికి వెళ్లనని గల్లా అరుణ స్పష్టం చేశారు. మంచి వారిని పెట్టుకోవడానికి తమ నేతకు వెసులుబాటు ఇచ్చి.. సహకరించాలనే రాజీనామా చేశానని గల్లా అరుణ ప్రకటించారు.


టీడీపీ పొలిట్‌బ్యూరోకు  గల్లా అరుణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామాను అరుణకుమారి పంపారు. సుధీర్ఘకాలం అరుణ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత అరుణకుమారి కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో చంద్రగిరి నియోజవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. అదే సమయంలో ఆమె తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ అరంగ్రేటం చేశారు. టీడీపీ తరపున గుంటూరు నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా గుంటూరు నుంచి తిరిగి పార్లమెంట్‌కు జయదేవ్ ఎన్నికయ్యారు.

Updated Date - 2020-10-02T01:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising