ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాలకు ఇన్‌చార్జీలుగా కేంద్ర మంత్రులు

ABN, First Publish Date - 2020-03-28T09:27:53+05:30

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర మంత్రులను వారి సొంత రాష్ట్రాలకు ఇన్‌చార్జీలుగా ప్రధాని మోదీ నియమించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థికశాఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏపీకి నిర్మల.. తెలంగాణకు కిషన్‌రెడ్డి
  • కరోనా కట్టడి చర్యలపై ప్రధానికి రోజూ నివేదికలు


న్యూఢిల్లీ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర మంత్రులను వారి  సొంత రాష్ట్రాలకు ఇన్‌చార్జీలుగా ప్రధాని మోదీ నియమించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, తెలంగాణకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని ఇన్‌చార్జీలుగా నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంత్రులు ప్రతి రోజూ రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకొని ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిక పంపాల్సి ఉంటుంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ అమలు, ప్రజల సమస్యలు, పేదవర్గాలకు ఆహారం సరఫరా, వైద్య సదుపాయాలు, వైద్య పరికరాలు, మందులు, మాస్కుల అందుబాటు, క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని మంత్రులు సమీక్షించనున్నారు. కాగా, జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకు ఇద్దరు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించినట్లు తెలిసింది. 

Updated Date - 2020-03-28T09:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising