ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోమవారం నుంచి మోగనున్న గుడి గంటలు

ABN, First Publish Date - 2020-06-07T14:09:20+05:30

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాసుని దర్శనభాగ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీనివాసుని దర్శనభాగ్యం సోమవారం నుంచి భక్తులకు కలనుంది. ట్రయల్ రన్ కింద  మూడు రోజులపాటు టీటీడీ ఉద్యోగులకు అనుమతి ఇస్తున్నారు. 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతించనున్నారు. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. టీటీడీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా 80 రోజుల అనంతరం శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా నేపథ్యంలో గతంలోలా వేలాది మంది భక్తులకు దర్శనానికి అనుమతించరు. పరిమిత సంఖ్యలో స్వామి దర్శనానికి అనుమతిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు.


8, 9 తేదీల్లో టీటీడీ ఉద్యోగులకు, 10న తిరుమలలో స్థానికులకు ట్రయల్‌రన్‌ కింద దర్శనం కల్పిస్తామన్నారు. 11నుంచి భక్తులందరినీ అనుమతిస్తామన్నారు. 65ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలకు దర్శనం లేదన్నారు. రోజూ 6వేల మందికి దర్శనం కేటాయిస్తామని, ఇందులో 3వేలు ఆన్‌లైన్‌ (రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం)లో, మరో 3వేలు ఆఫ్‌లైన్‌ ద్వారా తిరుపతిలోని ఎస్‌ఎ్‌సడీ కౌంటర్లలో ఒకరోజు ముందు కేటాయిస్తామన్నారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30గంటల వరకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. తొలిగంట స్వయంగా వచ్చే వీఐపీలకు బ్రేక్‌ దర్శనం ఉంటుందని, ఎలాంటి సిఫారసులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలకు చెందిన వారు తిరుమలకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-06-07T14:09:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising