ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువతి ఆందోళన

ABN, First Publish Date - 2020-06-06T09:54:48+05:30

టెక్కలి ఆదీఆంధ్రా వీధికి చెందిన యర్ర నారాయణరావు తనను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని, న్యాయం చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి: టెక్కలి ఆదీఆంధ్రా వీధికి చెందిన యర్ర నారాయణరావు తనను  ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని, న్యాయం చేయాలని దాసరి భారతి స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టింది. బాధితురాలు, పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణరావు, భారతి మూడేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. పెళ్లి విషయం ప్రస్తావించేసరికి ఆ యువకుడు ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.


తనకు పెళ్లి సంబంధాలు వచ్చినప్పటికీ నారాయణ పెళ్లి చేసుకుంటానని మా టిచ్చాడని, తాము ఎంతో అన్యోన్యంగా ఉండేవారమని, ఇప్పుడేమో తనని కాదంటున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనవద్ద ఫోన్‌ సంభాషణలు, ఫొటోలు అన్ని ఉన్నాయని,  తమ ప్రేమ వ్యవహారం కులపెద్దల సమక్షంలో పెట్టినప్పటికీ పెళ్లికి అంగీకరించలేదని, దీంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. తన తండ్రి అనారోగ్యంతో మృతిచెందడంతో నారాయణ రావు తన పెళ్లికి ఒప్పుకోకుండా పథకం రచించాడని, దీనిపై విచారణ చేసి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఎస్‌ఐ డి.గణేష్‌  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-06T09:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising