ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారులను మారిస్తే కోర్టుని ఆశ్రయిస్తాం

ABN, First Publish Date - 2020-07-12T11:23:55+05:30

గత ప్రొసీడింగ్‌లు కాదని, టీడ్కో లబ్ధిదారులను మారిస్తే ఉన్నతన్యాయస్థానం ఆశ్రయిస్తామని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవి కుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌

జగ్గుశాస్త్రులపేటలోని టిడ్కో ఇళ్ల వద్ద నిరసన


ఆమదాలవలస, జూలై 11: గత ప్రొసీడింగ్‌లు కాదని, టీడ్కో లబ్ధిదారులను మారిస్తే ఉన్నతన్యాయస్థానం ఆశ్రయిస్తామని  ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవి కుమార్‌ తెలిపారు. శనివారం లబ్ధిదారులతో కలిసి జగ్గుశాస్త్రులపేట వద్ద నిర్మించిన 527 టిడ్కో ఇళ్ల వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదా రుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. లబ్ధిదారులకు మేలు చేయవలసిన మునిసిపల్‌ అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


గత ప్రభుత్వ హయాంలో అప్పటి కమిషనర్‌ అర్హులను గుర్తించి, వారి  అభిప్రాయం ప్రకారం 300, 365,430 అడుగుల ఇళ్లు కేటాయించి ప్రొసీడింగ్‌ పత్రాలు అందించా మన్నారు. ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని తెలిపారు. లబ్ధిదారులు కమిషనర్‌ ఖాతాకే డీడీలు జమచేశారని గుర్తుచేశారు. ఏడాదిలో ప్రభుత్వం ఒక్కఇళ్లు ఇవ్వ లేదని, పైసా బిల్లు కూడా చెల్లించ లేదని తెలిపారు. కార్యక్రమంతో టీడీపీ నాయకులు ఎం.రమేష్‌, తమ్మినేని గీత, బోర గోవిందరావు, టి.విద్యాసాగర్‌, ఎస్‌.మురళి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-12T11:23:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising