ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్వాక్రా సంఘాలకు రుణాలిస్తాం

ABN, First Publish Date - 2020-11-25T05:04:22+05:30

జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ) ద్వారా డ్వాక్రా సంఘాలకు రుణాలు అందిస్తున్నట్టు ఆ బ్యాంకు డీజీఎం ఎస్‌.రమేష్‌ తెలిపారు. చల్లవానిపేట కూడలిలోగల డీసీసీబీ ద్వారా వివిధ డ్వాక్రా సంఘాల మహిళలకు మంగళవారం బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు.

రుణ పత్రం అందిస్తున్న డీజీఎం రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీసీసీబీ డీజీఎం రమేష్‌

జలుమూరు : జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీ) ద్వారా డ్వాక్రా సంఘాలకు రుణాలు అందిస్తున్నట్టు ఆ బ్యాంకు డీజీఎం ఎస్‌.రమేష్‌ తెలిపారు. చల్లవానిపేట కూడలిలోగల డీసీసీబీ ద్వారా వివిధ డ్వాక్రా సంఘాల మహిళలకు మంగళవారం బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాల పొదుపును బట్టి ఒక్కో సంఘానికి గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తున్నట్టు తెలిపారు. రూ.2 లక్షలు వరకు 7 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నట్టు చెప్పారు. స్వయంశక్తి సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రాయితీలు వర్తిస్తాయన్నారు. 

7.6 శాతం వడ్డీకే దీర్ఘకాలిక రుణాలు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా అందిస్తున్న భూమి అభివృద్ధి వంటి దీర్ఘకాలిక రుణాలు 7.6 శాతం వడ్డీకే అందిస్తున్నట్టు డీజీఎం రమేష్‌ తెలిపారు. అలాగే బంగారంపై రుణాలు 7 శాతం వడ్డీకే ఇస్తున్నట్టు చెప్పారు. ఒక గ్రాము బంగారానికి రూ.3300 రుణం అందిస్తున్నట్టు తెలిపారు. చల్లవానిపేట జిల్లా కేంద్ర సహకారబ్యాంకు రూ.65 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్‌ సంతోషి, సూపర్‌వైజర్‌ సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-11-25T05:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising