ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భౌతిక దూరం పాటించేలా చూడండి

ABN, First Publish Date - 2020-04-09T12:02:51+05:30

ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని


కలెక్టరేట్‌,  ఏప్రిల్‌ 8: ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్‌తో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనావైరస్‌ వ్యాప్తించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వైద్యుల భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెల్లకుండా చర్యలు తీసు కోవాలని తెలిపారు.


వ్యవసాయ, మార్కెటింగ్‌ పనులకు ఎటువంటి ఇబ్బం దులు తలెత్తనీయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా కంటైన్‌ మెంట్‌, బఫర్‌జోన్లు చివరి కేసు వరకు కొనసాగాలని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డి  మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకు నేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ జె.నివాస్‌, జేసీ కె.శ్రీనివాసులు, ఎస్పీ అమ్మిరెడ్డి, ఐటీడీఏ పీవో సాయికాంత్‌ వర్మ, టైనీ కలెక్టర్‌ ఎ.భార్గవ తేజ,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-09T12:02:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising