16న విద్యుత్ ఉద్యోగుల భారీ ర్యాలీ
ABN, First Publish Date - 2020-11-14T03:08:39+05:30
అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరు విద్యుత్ భవన్‌లో విద్యుత్ ఉద్యోగులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
గుంటూరు, నవంబరు 13: అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరు విద్యుత్ భవన్‌లో విద్యుత్ ఉద్యోగులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో సెంట్రల్ డిస్కం జేఏసీ చైర్మన్ సీహెచ్ పురుషోత్తమరావు మాట్లాడుతూ ట్రాన్స్‌కో యాజమాన్యం విద్యుత్ సౌధలో ఉద్యోగులపై అనుచితంగా వ్యవహరించటం సరికాదని అన్నారు. విద్యుత్ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఈనెల 16న గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కె.వెంకటేశ్వర్లు, కేవీ సురేష్, ఎం.వీరాంజనేయులు, రాజేష్‌ఖన్నా, రవిశంకర్, నరసింహారావు, నాగబ్రహ్మచారి తదితరులున్నారు.
Updated Date - 2020-11-14T03:08:39+05:30 IST