నేడు ఏపీ ఈసెట్
ABN, First Publish Date - 2020-09-14T09:16:26+05:30
జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఏపీ ఈసెట్-2020 సోమవారం జరగనుంది.
ఎచ్చెర, సెప్టెంబరు 13: జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఏపీ ఈసెట్-2020 సోమవారం జరగనుంది. పాలిటెక్నిక్ డిప్లమో పూర్తిచేసిన వారు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశానికి ఇంజినీరింగ్ సెట్ (ఈ-సెట్)ను నిర్వ హించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండు షిప్టుల్లో ఆన్‌లైన్‌లో పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించి వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల (ఎచ్చెర్ల), శివానీ ఇంజినీరింగ్ కళాశాల (చిలకపాలెం), జీఎంఆర్ ఐటీ (రాజాం), ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్ (టెక్కలి) కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు తమతో పాటు తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. మొత్తం 1232 మంది విద్యార్థులు ఈసెట్ రాయనున్నారు.
Updated Date - 2020-09-14T09:16:26+05:30 IST