ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యుడి ఇంట్లో చోరీ

ABN, First Publish Date - 2020-11-30T04:52:12+05:30

శ్రీకాకుళంలో వరుస చోరీలతో దొంగలు హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేస్తున్నారు. మొన్న ఓ రిటైర్డ్‌ అధికారి ఇంట్లో చోరీ ఘటన మరువక ముందే.. బలగ షిర్డీ సాయినగర్‌లోని డాక్టర్‌ బమ్మిడి సందీప్‌కుమార్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. 6 కిలోల వెండిని అపహరించుకుపోయారు

సామాన్లు చిందరవందరగా పడేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




 ఆరు కిలోల వెండి అపహరణ

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, నవంబరు 29: శ్రీకాకుళంలో వరుస చోరీలతో దొంగలు హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌ చేస్తున్నారు.  మొన్న ఓ రిటైర్డ్‌ అధికారి ఇంట్లో చోరీ ఘటన మరువక ముందే.. బలగ షిర్డీ సాయినగర్‌లోని డాక్టర్‌ బమ్మిడి సందీప్‌కుమార్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. 6 కిలోల వెండిని అపహరించుకుపోయారు. ఈ నెల 13న ఇంటికి తాళం వేసి డాక్టర్‌ సందీప్‌కుమార్‌ కుటుంబసభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. మళ్లీ ఆదివారం ఇంటికి చేరుకోగా.. తలుపులు తొలగించి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న ఆరు కిలోల వెండిని కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారమందించారు. డీఎస్పీ మహేంద్ర, సీఐ పీవీ రమణ  ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 



Updated Date - 2020-11-30T04:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising