ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిసెంబరు 15 నాటికి పనులు పూర్తి చేయాల్సిందే..

ABN, First Publish Date - 2020-11-28T05:05:04+05:30

పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కింద చేపడుతున్న పనులను డిసెంబరు 15 నాటికి పూర్తి చేయాల్సిందేనని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు.

అధికారులు, సిబ్బందితో సమీక్షిస్తున్న జేసీ శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

  జేసీ శ్రీనివాసులు 

రేగిడి, నవంబరు 27: పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కింద చేపడుతున్న పనులను డిసెంబరు 15 నాటికి పూర్తి చేయాల్సిందేనని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత తరగతులు ప్రారంభమైనందున విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఎపీడీవో జేజీ స్టిఫెన్‌ సన్‌, తహసీల్దార్‌ బి.సత్యం, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ లను ఆదేశించారు. పాఠశాలల వారీగా పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. పనులు దాదాపు 70 శాతం పూర్తి కాగా మిగిలిన పనులను డిసెంబు 15 నాటికి పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మండల స్థాయి అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, పనుల్లో పురుగతి లేకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా  ఒకరిద్దరు ఇంజి నీరింగ్‌ అసిస్టెంట్లకు వేసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేసి భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని హెచ్చరించారు. అలాగే మండలంలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ భవనాలను త్వరతగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

 

 

Updated Date - 2020-11-28T05:05:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising