ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి చేపట్టాలి

ABN, First Publish Date - 2020-03-16T09:47:09+05:30

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పోలీస్‌ యంత్రాంగం కనుసన్నల్లో ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆటవిక రాజ్యంలో ఉన్నామా?

వైసీపీ నేతలు రౌడీ రాజ్యాన్ని తలపిస్తున్నారు..

ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు


నిమ్మాడ (టెక్కలి), మార్చి 15: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పోలీస్‌ యంత్రాంగం కనుసన్నల్లో ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిలో చేపట్టిందని, దీనిని రద్దు చేసి ఈ ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభించా లని టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చె న్నాయుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం స్వగ్రామం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదని, అధి కార పార్టీ తీరు చూస్తే ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం వస్తోందన్నారు.


అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉందని, అనేక చోట్ల ఆ పార్టీ నాయకులు ప్రతి పక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్‌ పేపర్లు చించి, వారిని బెదిరించి ఆస్తులను, పంటలను ధ్వంసం చేసి ఏకగ్రీవం చేసు కున్నారని ఆరోపిం చారు. వైసీపీ కార్యకర్తలు, నాయకుల వ్యవహరిం చిన తీరు చూస్తుంటే రౌడీ రాజ్యాన్ని తలపించారని విమర్శించారు. ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేసిన వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అధికార పార్టీ దమన కాండ వల్లే ఎన్నికలు వాయిదా పడ్డాయని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-16T09:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising