ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

ABN, First Publish Date - 2020-12-10T05:09:29+05:30

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎంపీడీవో పి.సూర్యనారాయణ తెలిపారు.

కవిటిలో ర్యాలీ నిర్వహిస్తున్న వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవిటి:పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత అందరిపైనా  ఉందని  ఎంపీడీవో పి.సూర్యనారాయణ  తెలిపారు. బుధవారం కవిటిలో వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఇంట్లో తడి,పొడి చెత్త  వేరుచేసి గ్రీన్‌ అంబాసిడర్‌ ద్వారా చెత్తసేకరణ కేంద్రానికి తరలించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వి.విజయ్‌కుమార్‌, ఈవో జి.వెంకటరావు, బి.నాగు పాల్గొన్నారు.ఫ ఇచ్ఛాపురం రూరల్‌ : ధర్మపురంలో   బుధవారం మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు  పారిశుధ్యంపై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యదర్శి కె.రవి మా ట్లాడుతూ చెత్త సేకరణకు ప్రతిఇంటి నుంచి రోజుకు రూ.రెండు చొప్పున్న నెలకు రూ.60 పంచాయతీకి చెల్లించాలని చెప్పారు.  ఫసోంపేట: సోంపేటలో మనం - మన పరిశుభ్రత  పక్షోత్సవాల్లో భాగంగా పంచాయితీ అధికారులు, వలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో తహసీల్దార్‌ సదాశివుని గురుప్రసాద్‌, ఎంపీడీవో సీహెచ్‌ శ్రీనివాసరెడ్డి, సోంపేట ఈవో తెంబ వాసు  పాల్గొన్నారు. ఫసోంపేట రూరల్‌ :  కొర్లాం పంచాయతీలో వలంటీర్లు, సచివాలయ, వైద్యఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలువునం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా  ర్యాలీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎం.శాంతకుమారి పాల్గొన్నారు.


  

Updated Date - 2020-12-10T05:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising