ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో బీసీలకు పెద్దపీట

ABN, First Publish Date - 2020-10-20T08:14:04+05:30

వెన్నుముకలాంటి బీసీలకు వైసీపీ పాలనలో పెద్దపీట పడిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నా రు. 139

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి

గుజరాతీపేట, అక్టోబరు 19 : వెన్నుముకలాంటి బీసీలకు వైసీపీ పాలనలో పెద్దపీట పడిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నా రు. 139 బీసీ కులాలకు ప్రాతిని ధ్యం కల్పిస్తూ 56 బీసీ కార్పొరేషన్ల ను ఏర్పాటు చేసి చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించిన సందర్భంగా సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో దివంగత వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మ్యానిఫెస్టో లో పేర్కొన్న దానికంటే మిన్నగా ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు. అనంతరం మం త్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులతో కలసి  ఏడు రోడ్ల కూడలిలోని వైఎస్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు. అలాగే కలెక్టరేట్‌ దారిలో గల మహాత్మా జ్యోతీరావ్‌పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ ఎంవీ పద్మావతి, నాయకులు చౌదరి సతీష్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


కష్టాలు చూసే..

 మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి : పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బీసీల కష్టాలను చూసే రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశార ని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ  దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఈ స్థాయిలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు.   ఆయా కులాలను అభివృద్ధి చేసి పదవులకు వన్నెతేవాలని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-20T08:14:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising