ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పాలి

ABN, First Publish Date - 2020-05-29T10:06:41+05:30

వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం


 గుజరాతీపేట, మే 28:వ్యవసాయాధారిత పరిశ్రమలు నెలకొల్పాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. గురువారం మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా స్థానిక జడ్పీ సమావేశమందిరంలో పరిశ్రమలు, మౌళిక సదుపాయాలు అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి సీతారాం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఏడాది కాలంలో అమలు చేసిన కార్యక్రమాలపై వివిధ వర్గాల ప్రజలను, మేదావులను సూచనలు, సలహాలు అడగడం సీఎం పాలన దక్షతకు మచ్చుతునక అని అన్నారు.


పథకాలు లబ్ధిదారులకు అందాలని, వీటి అమలులో బలాలు, బలహీనతలు, వైఫల్యాలు తెలుసుకొని వాటిని సరి చేసుకోవడానికి కార్యక్రమం నిర్వహించడం  ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. జనరంజక పాలనకు సీఎం శ్రీకారం చుట్టారని  తెలిపారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మాట్లాడతూ గత వైఫల్యాలను అధిగమించాలని, మెరుగైన విధానాలను అమలు పర్చాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన అని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ నివాస్‌, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, సీపీవో మోహనరావు, డీఐసీ జీఎం గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T10:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising