ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4,130 పంట కోత ప్రయోగాల లక్ష్యం

ABN, First Publish Date - 2020-09-23T10:52:44+05:30

ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 4,130 పంట కోత ప్రయోగాలు లక్ష్యం గా నిర్ణయించినట్లు జిల్లా ఉపగణాంకాధికారి డి. సురేంద్ర తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లా ఉపగణాంకాధికారి సురేంద్ర


రేగిడి, సెప్టెంబరు 22: ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 4,130 పంట కోత ప్రయోగాలు లక్ష్యం గా నిర్ణయించినట్లు జిల్లా ఉపగణాంకాధికారి డి. సురేంద్ర తెలిపారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. వరి సాగు విస్తీర్ణం ప్రకారం 980 బీమా యూనిట్లు ప్రతిపాదించామని, దీని ప్రకారం పంటకోత ప్రయోగాలు నిర్వహించి జిల్లాలో వరి దిగుబడి అంచనా వేస్తామని చెప్పారు. పంట నష్టం వచ్చిన రైతులకు వైఎస్‌ఆర్‌ఎఫ్‌సీఐ పథకంలో బీమా అందిస్తామని పేర్కొన్నారు. అలాగే మొక్కజొన్నకు సంబంధించి జిల్లాలో 15,974 విస్తీర్ణంలో సాగు ఉండగా, 83 బీమా యూనిట్లలో 416 మొక్కజొన్న పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏ, ఎంపీ ఈవోలకు శిక్షణ ఇచ్చారు. పంటకోత ప్రయో గాలు పక్కాగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ బి.సత్యం, ఏవో మురళీకృష్ణ, ఏఎస్‌వో ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-23T10:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising