టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తగదు
ABN, First Publish Date - 2020-12-02T05:03:45+05:30
అసెంబ్లీ సమావేశాల్లో పేదల సమస్యలపై నిలదీస్తారన్న భ యంతోనే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆ పార్టీ ఇచ్ఛాపురం పట్టణా ధ్యక్షుడు కాళ్ల ధర్మారావు విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ తగదు
ఇచ్ఛాపురం: అసెంబ్లీ సమావేశాల్లో పేదల సమస్యలపై నిలదీస్తారన్న భ యంతోనే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆ పార్టీ ఇచ్ఛాపురం పట్టణా ధ్యక్షుడు కాళ్ల ధర్మారావు విమర్శించారు. మంగళవారం ఇచ్ఛాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యుత్ మీటర్లు, పంటల బీమాపై ప్రభుత్వాన్ని నిలదీస్తే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం తగదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తితలీ పరిహారం ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. అసెంబ్లీలో అచ్చెన్నాయుడు వేసిన 22 ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని తెలిపారు.ఇద్దరు మంత్రులు చంద్రబాబును సంబోదించిన తీరు, రైతు సమస్యలపై పోరాటం చేస్తున్న వార్ని అడ్డుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీయాదవ్, జిల్లా కార్యదర్శి లీలారాణి, పట్టణ కార్యదర్శి నందికి జాని పాల్గొన్నారు.
Updated Date - 2020-12-02T05:03:45+05:30 IST