ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేత్రపర్వం.. ఆదిత్యుడి కల్యాణం

ABN, First Publish Date - 2020-04-05T10:27:56+05:30

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లిలోని సూర్యనా రాయణ స్వామి ఆలయంలో చైత్రశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని ఆదిత్యు డికి వార్షిక కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరసవల్లి, ఏప్రిల్‌ 4 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లిలోని సూర్యనా రాయణ స్వామి ఆలయంలో చైత్రశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని ఆదిత్యు డికి  వార్షిక కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు.   ఈమేరకు శని వారం సాయంత్రం  ఉషా పద్మినీ ఛాయా సమేత సూర్యనారాయణ కల్యాణ ఉత్సవమూర్తులను ఆలయ ధ్వజస్తంభ మండపంలోకి అర్చకులు వేం చేయించారు. ఈ సందర్భంగా ఆలయం తరఫున  ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ స్వామికి  పట్టువస్త్రాలను సమర్పించారు.


కల్యాణ ఉత్సవ మూ ర్తులను అర్చకులు సుగంధ సువర్ణ పుష్పాలతో అర్చకులు అలంకరించి కల్యా ణోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆ ధ్వర్యంలో అర్చకుడు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షా సూత్రధారణ, యజ్ఞోపవేత ధారణ, కన్యాదానం, శుభముహూర్తం, తలంబ్రాలు, మంగళ సూ త్రధారణ, బ్రహ్మముళ్లు, ప్రవేశ హోమాదులు, నీరాజనంతో స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిపించారు. మహోత్సవంలో ఆలయ అర్చకులు నగేష్‌ కశ్యప, ఫణీంద్రశర్మ, హరిబాబు, దర్బముళ్ల శ్రీనివాసశర్మ, సాంబమూర్తి, సందీప్‌, కిరణ్‌శర్మ, రంజిత్‌ శర్మ, తదితరులు పాల్గొన్నారు  భక్తులెవరినీ అనుమతించలేదు.  

Updated Date - 2020-04-05T10:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising