ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండోసారి ప్లాస్మా దానం

ABN, First Publish Date - 2020-09-23T11:03:03+05:30

హిరమండలానికి చెందిన పొగిరి బుచ్చిబాబు కొవిడ్‌ నుంచి కోలుకుని జిల్లాలో రెండు సార్లు ప్లాస్మా దానం చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిరమండలం,సెప్టెంబరు 22: హిరమండలానికి చెందిన పొగిరి బుచ్చిబాబు కొవిడ్‌ నుంచి కోలుకుని జిల్లాలో రెండు సార్లు ప్లాస్మా దానం చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఈయన స్థానిక గాయత్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గత నెలలో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితుడికి ప్లాస్మాదానం చేశారు. రెడ్‌క్రాస్‌ ఇచ్చిన పిలుపు మేరకు మరలా ప్రాథమిక పరీక్షలు చేయించుకుని మంగళవారం శ్రీకాకుళం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌లో రెండో పర్యాయం ప్లాస్మా ఇచ్చారు.


రెడ్‌ క్రాస్‌ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ.. బుచ్చిబాబును ఆదర్శంగా తీసుకుని కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ పీఆర్వో పి.చైతన్య తదితరులు పాల్గొన్నారు. బుచ్చిబాబు ఇప్పటి వరకు  19 సార్లు రక్తదానం చేశారు.

Updated Date - 2020-09-23T11:03:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising