శ్రీకాకుళంలో నాటు బాంబుల కలకలం
ABN, First Publish Date - 2020-10-04T14:26:38+05:30
శ్రీకాకుళం : జిల్లాలోని మెలియాపుట్టిలో నాటు బాంబులు బయటపడటం కలకలం రేగుతోంది.
శ్రీకాకుళం : జిల్లాలోని మెలియాపుట్టిలో నాటు బాంబులు బయటపడటం కలకలం రేగుతోంది. ఆదివారం ఉదయం మెలియాపుట్టిలో ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర 18 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దర్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. అరెస్ట్ అయిన నిందితులను ఎర్ర రాజేష్, నవీన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఈ బాంబులు ఎందుకు పెట్టారు..? ఎవరికోసం పెట్టారు..? ఈ ఇద్దరి వెనుక ఏమైనా గ్యాంగ్ ఉందా..? ఇంతకీ ఆ ఇద్దరు నిందితులు ఏ ప్రాంతానికి చెందిన వారు..? అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతారని తెలిసింది.
Updated Date - 2020-10-04T14:26:38+05:30 IST