రౌడీషీటర్ల జాబితా అందించండి
ABN, First Publish Date - 2020-09-14T09:17:11+05:30
శ్రీకాకుళంలో రౌడీషీటర్ల జాబితా అందజేయాలని ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశించారు.
సీసీ కెమెరాలు పర్యవేక్షించండి
ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశం
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 13: శ్రీకాకుళంలో రౌడీషీటర్ల జాబితా అందజేయాలని ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశించారు. నగరంలో ఆదివారం అమలు చేసిన లాక్‌డౌన్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శ్రీకాకుళంలో రౌడీషీటర్లు ఎంతమంది ఉన్నారు, వారి కార్యకలాపాలు, స్టేషన్లవారీగా జాబితాను అందజేయాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరంతరం రౌడీలపై నిఘా ఉంచాలని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణతో కరోనాను కట్టడి చేయాలని చెప్పారు.
జీటీ రోడ్డులోని సెంటర్ పార్కింగ్‌ను రద్దుచేసి ఎన్టీఆర్ హైస్కూల్‌కు తరలించడంతో రహదారి విశాలంగా మారిందన్నారు. వాహన చోదకుల సౌకర్యార్థం సూర్యమహల్ జంక్షన్ నుంచి మిత్ర స్టోర్ వరకు మధ్యలో ఉన్న స్థలంలో పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు. ప్రధాన జంక్షన్ల వద్ద అమర్చిన సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించాలన్నారు. దుకాణాల్లో సిబ్బంది, వినియోగదారుడితో కలిపి ఐదుగురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు మూర్తి, ప్రసాద్, సీఐలు శంకరరావు, అంబేడ్కర్, వెంకటరమణ, ఎస్‌ఐలు రమేష్, రఘు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-09-14T09:17:11+05:30 IST