ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమన్వయంతో పనిచేయండి

ABN, First Publish Date - 2020-10-31T09:06:26+05:30

అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే రెడ్డిశాంతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాతపట్నం : అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఎమ్మెల్యే రెడ్డిశాంతి తెలిపారు. శుక్రవారం పాతపట్నం ఎంపీడీవో  కార్యాలయంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించే  ఉపాధిహామీ పథకం  మెటీరియల్‌ కంపోనెంట్‌ పనులపై కార్యాచరణ ప్రణాళిక రూపొదించేందుకు నియోజకవర్గస్థాయిలో అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో పీఆర్‌ ఈఈ ఎం.జగదీశ్వరరావు, డీఈ గొలివి ప్రదీప్‌, ప్రత్యేకాధికారి బి.లవరాజు, ఎంపీడీవో పీజేప్రసాద్‌, ఏపీవో తెంబూరు రవి  పాల్గొన్నారు.


 అర్హులైన గిరిజనులకు సాగు పట్టాల పంపిణీ చేసినట్టు ఎమ్మెల్యే రెడ్డిశాంతి తెలిపారు. ఎస్‌ఎస్‌ మణుగు సచివాలయపరిధిలో గిరిజనులకు పోడు భూములపై సాగు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌  కాళీప్రసాద్‌, గేదెల సూర్యం, పడాల గోపి  పాల్గొన్నారు.


 ఏనుగుల  సమస్యకు  పరిష్కారం చూపాలని కొత్తూరు, హిరమండలం మండలాల గిరిజన సంఘ నాయకులు ఎం.తిరుపతిరావు, ఎన్‌.అప్పన్న, ఎం.లక్ష్మణరావు సురేష్‌, ఎస్‌.బంగారుబాబు, ఎస్‌.రవి ఎమ్మెల్యే రెడ్డి శాంతికు వినతిపత్రం అందజేశారు.


 కొత్తూరు రూరల్‌ : ఆల్తీ పంచాయతీ తామరగూడలో శుక్రవారం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ సారిపిల్లి ప్రసాదరావు, గొగుల చల్లంనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T09:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising